రోడ్ల నిర్మాణంలో నాణ్యత విషయం లేదు రాజీ లేదు: ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి

మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాశసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సమీక్షాసమావేశం నిర్వహించారు.   మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడెం, ఘట్టుప్పల్ మండలాల లో మంజూరైనా 26 పంచాయతీ రాజ్  రోడ్ల పనులగురించి చర్చించారు,  టెండర్​ ప్రాసెస్​ పూర్తిఅయిన తరువాత ప్రస్తుతం అభివృద్ది పనులు ఏ స్టేజీలో ఉన్నాయో ఆరా తీశారు.  కాంట్రాక్టర్లు నిర్దేశిత సమయంలో పనులను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్​ శాఖా మంత్రి సీతక్కతో మాట్లాడి నిధులు మంజూరు చేయించానంటూ.. రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఆదేశాలు జారీ చేశారు. 

ALSO READ | బీజేపీ, BRS కుట్రలో భాగంగానే పొంగులేటిపై ఈడీ రైడ్స్: మహేష్ గౌడ్