చెరువులో కట్టిన డెయిరీని కూల్చివేయండి : ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

గన్నేరువరం/తిమ్మాపూర్‌‌‌‌, వెలుగు: గుండ్లపల్లి దేవుని చెరువులో నిర్మించిన కరీంనగర్ పాల డెయిరీని వెంటనే కూల్చాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.  సోమవారం గుండ్లపల్లి దేవుని చెరువులో నిర్మించిన కరీంనగర్ డెయిరీని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులను కబ్జా చేస్తే సహించలేదని లేదన్నారు. డెయిరీని పూర్తిగా చెరువులోనే కట్టారని దానికి అనుమతులు ఎలా ఇచ్చారని  అధికారులను ప్రశ్నించారు.

ఎమ్మెల్యే  ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ డైరీని పరిశీలించారు. అంతకుముందు తిమ్మాపూర్‌‌‌‌ మండలం ఎల్‌‌ఎండీ కాలనీలోని క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే పంచాయతీ అధికారులతో మీటింగ్‌‌ నిర్వహించారు. ఎస్సీ సబ్‌‌ ప్లాన్‌‌ నిధులతో ఎస్సీ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో పీఆర్‌‌‌‌ డీఈలు రవి ప్రసాద్, మంజుభార్గవి పాల్గొన్నారు.