పుస్తకాలు చదివితే జ్ఞానం పెరుగుతుంది : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డిటౌన్, వెలుగు : పుస్తకాలు చదివితే జ్ఞానం పెరుగుతోందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.  గురువారం కామారెడ్డి జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాలను ఎమ్మెల్యే జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడైనా జ్ఞానమే అధికారమన్నారు. గ్రంథాలయాలకు యువత రెగ్యులర్​గా వచ్చి బుక్స్​ చదివి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలవాలని సూచించారు.  

జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్​రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయం ఒక దేవాలయం లాంటిదన్నారు. కార్యక్రమంలో అడిషనల్  కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి, మున్సిపల్​ చైర్​పర్సన్ గడ్డం ఇందుప్రియ, జిల్లా లైబ్రరీ సెక్రటరీ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.