కూనూరు హైస్కూల్​లో ల్యాబ్ ఏర్పాటు చేస్తాం

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: కూనూరు హైస్కూల్​కు త్వరలో కంప్యూటర్ , సైన్స్​ల్యాబ్​ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా జఫర్​గఢ్​మండలం కూనూరు జడ్పీఎస్​ఎస్​స్వర్ణోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ జడ్పీఎస్​ఎస్ కు త్వరలో కాంపౌండ్​వాల్, అడిషనల్​క్లాస్​రూంలను మంజూరు చేస్తామన్నారు. 

స్కూల్​ ఏర్పడిన 1974 నుంచి 2024 వరకు 50 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఇక్కడ చదివిన పూర్వవిద్యార్థులందరూ స్వర్ణోత్సవా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి కార్పస్​ఫండ్​ఏర్పాటు చేసి స్కూల్​అభివృద్ధికి కృషి చేయాలన్నారు. స్పెషల్​క్లాస్​ కాంట్రాక్టర్​వెంకటేశ్వర్​రెడ్డి, నాగమల్ల అశోక్​, రిటైర్డ్​టీచర్లు తిరునగరి స్వామి, అనూప్​కుమార్​పాల్గొన్నారు.