పేషంట్ వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కు

  •      నిమ్స్ కు వెళ్లి అందజేసిన ఎమ్మెల్యే

సుల్తానాబాద్, వెలుగు: ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి  అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్​లో  చేరాడు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయాన్ని ఇప్పించాలని పేషెంట్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును కోరాడు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి రూ.2 లక్షల 30 వేలు మంజూరు చేయించారు. ఇందుకు సంబంధించిన ఎల్ఓసి చెక్కును శనివారం ఎమ్మెల్యే విజయ రమణారావు తానే స్వయంగా నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి పేషెంట్ కుటుంబ సభ్యులకు అందజేశాడు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.