10 ఏళ్లలో సిటీని అభివృద్ధి చేశాం : గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కరీంనగర్ టౌన్, వెలుగు: పదేళ్లలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి,  ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.  సోమవారం 6వ డివిజన్ కాపువాడలో రూ.27లక్షల ఎల్ఆర్ఎస్ నిధులతో చేపట్టనున్న సీసీరోడ్డు, ఎస్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూజీ డ్రైనేజీ నిర్మాణ పనులకు మేయర్ సునీల్ రావుతో కలిసి గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీలోని ప్రతీ డివిజన్‌‌‌‌‌‌‌‌కు భారీగా నిధులు కేటాయించి సమస్యలన్నింటినీ పరిష్కరించామని గుర్తు చేశారు.

 గత ప్రభుత్వ హయాంలో సిటీలో  అభివృద్ధి పనుల జాతర జరిగిందన్నారు. సిటీని రాష్ట్రంలోనే అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. పార్కులు, కేబుల్  బ్రిడ్జిని నిర్మించామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కోల మాలతి, నాంపల్లి శ్రీనివాస్, పద్మ, లీడర్లు  సంపత్ రెడ్డి,  కృష్ణ,  ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కమిషనర్ ప్రఫుల్‌‌‌‌‌‌‌‌దేశాయ్‌‌‌‌‌‌‌‌, తదితరులు పాల్గొన్నారు.