నిజామాబాద్, వెలుగు: నగరంలోని కళాకారులు రచంచి పాడిన బోనాల పండుగ సాంగ్‌ను గురువారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన ఆషాడమాసంలో కులమతాలకతీతంగా నిర్వహించే బోనాల విశిష్టతను చాటేలా గేయాన్ని రూపొందించిన సాయి లహరీ స్టూడియో టీంను ఎమ్మెల్యే అభినందించారు.
సింగర్ సాయి లవోల, అంజలి, క్రాంతికుమార్, కొరియోగ్రాఫర్ తోట ప్రశాంత్, కెమెరామెన్ వెంకట్వర్మ, మ్యూజిక్ అందించిన విజయ్ ఐలేని, ఆర్ట్ డైరెక్టర్ క్రాంతికుమార్, రాజు తదితరులు ఉన్నారు.