గత పాలకుల నిర్లక్ష్యంతో యూజీడీ నిరుపయోగం

నిజామాబాద్​అర్బన్, వెలుగు : గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ ప్రభుత్వం, అప్పటి అర్బన్​ఎమ్మెల్యే బిగాల గణేశ్​గుప్తా నిర్లక్ష్యం కారణంగా సిటీలో అండర్​ గ్రౌండ్ ​డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఎమ్మెల్యే ధన్​పాల్ ​సూర్యనారాయణ ఆరోపించారు. సిటీ శివారులోని భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ​ మాట్లాడుతూ..

కేంద్ర ప్రభుత్వం అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ నిర్మాణానికి రూ.30కోట్లు, నీటి సరఫరాకు రూ.98 కోట్లు కేటాయించిందని, 2017 –2020 మధ్యే ఈ పనులు పూర్తి కావాల్సి ఉండగా, అప్పటి ఎమ్మెల్యే బిగాల నిర్లక్ష్యంతో పనులు ఆగిపోయాయన్నారు. తాజాగా అమృత్ 2.0లో భాగంగా అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ నిర్మాణానికి

రూ.217 కోట్లు, నీటి సరఫరాకు రూ.162 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. ఏడాదిలోపు పనులు పూర్తయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, లీడర్లు పాల్గొన్నారు.