ఎస్​డీఎఫ్​ ఫండ్స్​ రూ.10 కోట్లు ఇవ్వాలె : ఎమ్మెల్యే ధన్​పాల్​

  • సీఎం రేవంత్​ను కోరిన ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్​, వెలుగు: ఇందూర్​ నగరం అభివృద్ధి పనులకు రూ.10 కోట్ల స్పెషల్​డెవలప్​మెంట్​ ఫండ్ (ఎస్​డీపీ) ఇవ్వాలని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యానారాయణ కోరారు. మంగళవారం ఆయన హైదరాబాద్​లో సీఎం రేవంత్​రెడ్డిని కలిసి ఈ  మేరకు వినతి పత్రం అందించారు.

నగర రోడ్ల అధ్వాన్న దుస్థితి, తాగునీరు.  డ్రైనేజీ సమస్య, అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ ఇష్యూను చర్చించానని సీఎం పాజిటివ్​గా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.