రైతులు దళారులను నమ్మి మోసపొవొద్దు : ఎమ్మెల్యే భూపతి రెడ్డి

ఇందల్వాయి, డిచ్​పల్లి, వెలుగు: రైతులు పండించిన సన్నాలకు  ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తుందని నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. శనివారం చంద్రయాన్​పల్లి, బీబీపూర్, డిచ్​పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.  పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని రైతులకు సూచించారు.

ఏ గ్రేడ్​రకం ధాన్యానికి రూ.2320, బీ గ్రేడ్ కు రూ.2300 చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.  కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్​ చైర్మన్​ తారచంద్​నాయక్, ఏఎంసీ చైర్మన్​గంగారెడ్డి, మండల అధ్యక్షుడు నవీన్​ గౌడ్, సొసైటీ చైర్మన్లు రాంచందర్​ గౌడ్​, గోవర్ధన్ రెడ్డి, లీడర్లు సంతోష్​రెడ్డి, ఇమ్మడి గోపి తదితరులు  పాల్గొన్నారు.