కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలి : బీర్ల ఐలయ్య 

  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సూచించారు. బొమ్మలరామారం మండలం పిల్లికుంట్ల తండా, మర్యాల, చౌదర్ పల్లి, రామలింగంపల్లి, జలాల్ పూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్​కు  రూ.2,320 మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తోందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకుని రైతులు అధిక లాభాలు ఆర్జించాలని తెలిపారు.