ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

  • ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి 

మిర్యాలగూడ, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం అడవిదేవులపల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ భూముల పట్టాలపై చర్యలు తీసుకొని పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నాయకులు సిద్ధు నాయక్, పొదిల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.