రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం  : ఎమ్మెల్యే బాలూనాయక్ 

దేవరకొండ, చింతపల్లి, నేరేడుగొమ్ము, చందంపేట, వెలుగు : రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. సోమవారం చింతపల్లి మండలం కుర్మేడు, చింతపల్లి, నేరేడుగొమ్ము మండలం పేర్వాలా, చందంపేట మండలం పోలేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పేరుతో రైతులను ఎవరైనా మోసం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

అంతకుముందు దేవరకొండ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, మాల్, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్లు అలివేలు సంజీవరెడ్డి, నాయిని జమునామాధవరెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎంఎ సిరాజ్ ఖాన్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ నరసింహ, పీఏసీఎస్​చైర్మన్లు వేణుధర్ రెడ్డి, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.