లోకల్​ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలి : ఎమ్మెల్యే బాలూనాయక్  

దేవరకొండ(పీఏ పల్లి), వెలుగు : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే బాలూనాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం పీఏపల్లి మండలం అంగడిపేట స్టేజ్ వద్ద మణికంఠ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.

స్థానిక పోరులో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. అంతకుముందు దేవరకొండలోని పర్వతాలు చెరువుకట్ట నుంచి చెన్నారం వరకు కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. సమావేశంలో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జమునామాధవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సింహ, పార్లమెంట్ కో–ఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, మండలాధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.