పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం : ఎమ్మెల్యే బాలునాయక్

  •     ఎమ్మెల్యే బాలునాయక్ 

దేవరకొండ, చందంపేట, వెలుగు : పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజల దశాబ్దాలకాల  త్వరలో నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మూడేళ్లలో జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేస్తామన్నారు.

 శుక్రవారం ఉదయం 9 గంటలకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును సందర్శించడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు తెలిపారు. మంత్రుల ఆధ్వర్యంలో డిండికి ఎదుల్లా నుంచి నీరు తేవాలని, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ సమస్యపై చర్చించనున్నట్లు వివరించారు. 

అనంతరం డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా నాగర్ కర్నూల్​జిల్లా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి గ్రామ పరిధిలోని హెలిప్యాడ్ సభ స్థలాన్ని, చందంపేట మండల పరిధిలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 


పారిశుధ్యం మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యం


పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య పనులు మెరుగుపర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వచ్ఛదనం.. పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. దేవరకొండలో రూ.5 లక్షల ఎంజీఎఫ్ నిధులతో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు, ఎల్ఐసీ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు. వృద్ధాప్య ఆశ్రమం వద్ద రూ.3.5 లక్షలతో వరద కాలువకు ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. క్యాంపు కార్యాలయంలోని చింతపల్లి దేవరకొండ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.