మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేస్తాం : విప్​, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​

 కోరుట్ల/కోనరావుపేట/చందుర్తి, వెలుగు: ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్నామని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల పనుల జాతరలో భాగంగా మంగళవారం కథలాపూర్‌‌, కోనరావుపేట, చందుర్తి మండలాల్లో సీసీ రోడ్లు, బ్రిడ్జిలు, బీటీ రోడ్లు నిర్మాణాలకు కలెక్టర్‌‌ సందీప్‌కుమార్‌‌ఝాతో కలిసి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో రూ.13.40 కోట్లతో 13 అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్‌‌ పెండింగ్‌ పనులను పూర్తిచేసి ప్రాజెక్ట్‌లో నీటిని నింపుతామన్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా వేములవాడ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారన్నారు. చందుర్తి మండలంలోని ఎర్ర చెరువు, పటేల్ చెరువులను ఎల్లంపల్లి నీటితో నింపుతామన్నారు.