బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : ఆది శ్రీనివాస్

కోనరావుపేట, వెలుగు: ఇటీవల ఉపాధి హామీ పనుల్లో మట్టిపెళ్లలు కూలి మృతి చెందిన  కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మారుపాక రాజవ్వ కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం పరామర్శించారు. గాయాలైన కూలీలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

ఉపాధి హామీ పనుల్లో కూలీలకు రక్షణ కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఫిరోజ్ పాషా, చెపూరి గంగాధర్, తాల్లపెల్లి ప్రభాకర్, పల్లం నర్సయ్య, నాలుక సత్యం, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.