వేములవాడలో సైన్స్‌‌‌‌‌‌‌‌ మ్యూజియం ఏర్పాటుకు కృషి :  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: వేములవాడలో సైన్స్‌‌‌‌‌‌‌‌ మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇన్‌‌‌‌‌‌‌‌స్పైర్​పేరిట సైన్స్ ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రియేటివిటీ పెంపునకు సైన్స్‌‌‌‌‌‌‌‌ దోహదం చేస్తుందన్నారు. విద్యార్థుల సైన్స్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిబిట్లను ఆయన పరిశీలించి అభినందించారు. సైన్స్‌‌‌‌‌‌‌‌ ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 68 ఇన్‌‌‌‌‌‌‌‌స్పైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు, 400కు పైగా ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. డీఈవో జగన్‌‌‌‌‌‌‌‌మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి దేవయ్య, మున్సిపల్​ వైస్​ చైర్మన్​ మహేశ్‌‌‌‌‌‌‌‌, ఏఎంసీ చైర్మన్​ రాజు పాల్గొన్నారు. 


చందుర్తి: చందుర్తి మండలం మూడపల్లిలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన యూనిట్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. 

డాక్టర్​ వృత్తి పవిత్రమైనది 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: డాక్టర్ వృత్తి పవిత్రమైనదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలోని మెడికల్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లకు వైట్ కోట్‌‌‌‌‌‌‌‌లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ కష్టపడి చదివి ఆరోగ్య తెలంగాణను తయారుకు కృషి చేయాలన్నారు. 

మంగళపల్లిలో శివాజీ విగ్రహావిష్కరణ 

కోనరావుపేట : కోనరావుపేట మండలం మంగళపల్లిలో ఆరె క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శివాజీ విగ్రహాన్ని ఆది శ్రీనివాస్​ ఆవిష్కరించారు.