15 ఏండ్ల ధర్మ పోరాటంలో గెలిచాను

  • చెన్నమనేని రమేశ్​ ప్రజలకు క్షమాపణ చెప్పాలి 
  • రాష్ర్ట ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్ డిమాండ్​

వేములవాడ, వెలుగు: నియోజకవర్గ ప్రజలను మోసగించిన చెన్నమనేని రమేశ్​బాబు క్షమాపణ చెప్పాలని రాష్ర్ట ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ​డిమాండ్ చేశారు. 15 ఏండ్ల ధర్మ పోరాటంలో గెలిచానని పేర్కొన్నారు.  శుక్రవారం వేములవాడ టౌన్ లోని క్యాంపు ఆఫీసులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు భారత పౌరసౌత్వంపై తప్పుచేయడంతో  పాటు చట్టాలు, కోర్టులను మోసగించినందుకు  కోర్టు రూ. 30 లక్షల ఫైన్ వేసిందని చెప్పారు. 

రమేశ్ బాబుది లా మేకర్ చరిత్ర కాదని.. లా బ్రేకర్ చరిత్ర అని ఎద్దేవా చేశారు. ఆయన తీరు కుటుంబానికి,  తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చిందన్నారు. 2009 నుంచి సుదీర్ఘ పోరాటం చేశానని,  తనకు అన్యాయం జరిగిందని సాక్షాత్తూ కోర్టు కూడా చెప్పిందని పేర్కొన్నారు. అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్​ వైస్​ చైర్మన్​ బింగి మహేశ్​, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్​ గౌడ్​, మార్కెట్​కమిటీ చైర్మన్​, వైస్​ చైర్మన్లు రొండి రాజు, రాకేశ్, మధు,  పుల్కం రాజు, సంఘ స్వామి యాదవ్​ పాల్గొన్నారు.