అభివృద్ధిని ఓర్వలేకనే అవాస్తవాలు రాస్తున్నారు : విప్​ ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం హయాంలో వేములవాడలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఓర్వలేని కొందరు మీడియాలో తప్పుడు, అవాస్తవ వార్తలు రాస్తున్నారని విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ మండిపడ్డారు. మంగళవారం వేములవాడ అర్బన్ మండలం అనుపురంలో కల్యాణలక్ష్మి, షాదీముబారర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో చేయని పనులను ఈ ఏడాదిలో తాము చేశామని, దీనిని ఓర్చుకోలేని కొందరు అవాస్తవ కథనాలు రాస్తూ కేటీఆర్ మెప్పు పొందాలని చూస్తున్నారన్నారు. 

రాజన్న ఆలయ విస్తరణ, రోడ్ల వెడల్పు, అన్నదాన సత్రం నిర్మాణం, ముంపు గ్రామాలకు ఇందిరమ్మ ఇండ్లు వంటి అభివృద్ధి పనులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్ల ఇస్తానని మీ నాయకుడు దేవుడికి శఠగోపం పెట్టిన విషయం మార్చిపోయారా అని ప్రశ్నించారు. ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇన్ని కుట్రలు చేస్తారా అని ఫైర్​ అయ్యారు.