మిథ్య: ది డార్కర్ చాప్టర్ సీజన్ 2 రివ్యూ

టైటిల్: మిథ్య: ది డార్కర్ చాప్టర్ సీజన్ – 2
ప్లాట్​ఫాం : జీ5
డైరెక్షన్ : కపిల్​శర్మ 
కాస్ట్ : హ్యూమా ఖురేషి, అవంతిక దస్సాని, నవీన్ కస్తూరియా, రజిత్ కపూర్ , 
లాంగ్వేజ్ : హిందీ

మిథ్య.. మొదటి సీజన్​ 2022లో వచ్చి హిట్టయిన సంగతి తెలిసిందే. దాని కొనసాగింపుగా ఇప్పుడు రెండో సీజన్​ వచ్చింది. మొదటి సీజన్​ కథ జూహీ (హ్యూమా ఖురేషి), రియా (అవంతిక దస్సాని) చుట్టూ తిరుగుతుంది. ఆ సీజన్​లో వాళ్లిద్దరూ అక్కాచెళ్లెళ్లు(తండ్రి ఒక్కడే తల్లులు వేరు) అని తెలుస్తుంది. ఈ సీజన్​ విషయానికి వస్తే.. జూహీ హిందీ ప్రొఫెసర్​గా సెటిల్​ అవుతుంది. తను రాసిన సాహిత్య నవల ‘ధుండ్‌’ని రిలీజ్​ చేస్తుంది. జూహీ తండ్రి ఆనంద్​ త్యాగి(రజిత్​ కపూర్​) కూడా ఫేమస్​ ఇంగ్లీష్​ రైటర్. తన కూతురు రచయితగా పేరు తెచ్చుకున్నందుకు చాలా సంతోషిస్తాడు.

కానీ.. ధుండ్​ పుస్తకాన్ని తానే రాశానని, దాన్ని ప్రింట్​ చేయకముందే జూహీ దొంగిలించిందని అమిత్ చౌదరి (నవీన్ కస్తూరియా) ఆరోపిస్తాడు. కానీ.. దానికి ఆమె పెద్దగా స్పందించకుండా ఆలోచనల్లో పడుతుంది. దాంతో అమిత్  లీగల్​ నోటీస్​ తీసుకొచ్చి ఆనంద్​కి ఇస్తాడు. ఆనంద్ ఆ నోటీస్​ని జూహీకి చూపిస్తాడు. అప్పుడు జూహీ దీనంతటికీ కారణం రియా అని చెప్తుంది. మరోవైపు జూహీ కుటుంబంలో విభేదాలు పెరుగుతూ ఉంటాయి.  రియా తన కుటుంబానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు వాళ్ల పరువు తీసేందుకు ప్లాన్లు వేస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె ఈ సమస్యల నుంచి ఎలా బయటపడింది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.