Women Health : పొల్యూషన్ వల్ల గర్భస్రావాలు..!

ఓజోన్ పొర కుంచించుకుపోవడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్ (కాలుష్య వాయువు), సల్ఫర్ డై ఆక్సై డ్ ల ప్రభావం పెరుగుతోంది. అలాగే భవంతుల కట్టడాల వల్ల, వాహనాల నుండి వచ్చే పొగ వల్ల కూడా నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కువగా విడుదలవుతుంది. ఈ ప్రాంతాలలో నివసిస్తే గర్భస్రావాలు ఎక్కువ అవుతున్నాయట. ఇలా 28 ఏళ్ల లోపు, సుమారు 1300 మహిళలపై అధ్యయనం చేస్తే వాళ్లలో వాయు కాలుష్యం వల్ల కొద్ది రోజులకే గర్భస్రావం అయినట్టు గుర్తించారు. 

మూడు నుంచి ఏడు రోజులు పాటు ఆ వాతావరణంలో గడిపిన వాళ్లలో ఇది మరింత ఎక్కువ. వాయు కాలుష్యం ఎక్కువ ఉన్న ప్రాంతాలలో మహిళలకు 16 శాతం గర్భస్రావం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే అది భావి తరాలపై దుష్ప్రభావం పడుతుంది. దానివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఒకవేళ గర్భం నిలబడినా పుట్టే పిల్లలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందంటున్నారు. 

లంగ్ డిసీజెస్, బ్రాంకైటిస్, ఆస్తమా వంటి వ్యాధులే కాకుండా కళ్లకు కూడా ఎక్కువ వ్యాధులు వస్తాయి. అంతేకాదు పిల్లలు పుట్టినప్పుడు ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉంటారు. వాళ్లకి వ్యాధి నిరోధక శక్తి తగ్గి రక్తహీనత తక్కువగా ఉంటుంది. కాబట్టి పర్యావరణాన్ని ఎంత సంరక్షించుకుంటే అంత మంచిది.