తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ ​నేతల ఆగ్రహం  

మిర్యాలగూడ, వెలుగు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై మిర్యాలగూడ కాంగ్రెస్​ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం పార్టీ కార్యాలయంలో బీసీ కాంగ్రెస్ నేతలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం రాజీవ్ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సొంత పార్టీ నేతలపై కామెంట్స్ చేయడం సరికాదన్నారు. తక్షణమే మల్లన్న తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు పొదిల శ్రీనివాస్, చిలుకూరు బాలకృష్ణ, కృష్ణ, బసవయ్య గౌడ్, నరేందర్ గౌడ్, దాసరి భీమేశ్ తదితరులు పాల్గొన్నారు.