ఇవాళ (జూన్3) ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు

న్యూఢిల్లీ: అంతరిక్షంలో సోమవారం అద్భుతం జరగనుంది. బుధుడు (మెర్క్యురీ), బృహస్పతి (జుపిటర్), శని (శాటర్న్), అంగారకుడు (మార్స్), వరుణుడు (యురేనస్), ఇంద్రుడు (నెప్ట్యూన్) ఒకే వరుసలోకి రానున్నాయి. ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యం కొన్ని రోజుల పాటు కనిపిస్తుందని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ దృశ్యం కనిపిస్తుందని పేర్కొంది. సూర్యోదయానికి 20 నిమిషాల ముందు తూర్పు దిక్కున జుపిటర్, మార్స్ ను నేరుగా కండ్లతో చూడవచ్చని, మిగతా గ్రహాలను టెలిస్కోప్  వంటి పరికరాల సాయంతో మాత్రమే వీక్షించవచ్చని తెలిపింది.