పుదీనాలో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు చర్మంపై మొటిమలు , మచ్చలు తొలగించటంలో సహాయపడతాయి. తద్వారా చర్మం కాంతి వంతంగా మారుతుంది. ఇందులో ఉండే సలిసిలిక్ ఆమ్లం చర్మం లోపలి మలినాలను తొలగించటంలో దోహదం చేస్తుంది. పుదీనాను ఉపయోగించే వివిధ రకాల ఫేస్ ఫ్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం…
అందమైన ముఖం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ, వివిధ రకాల కారణాల వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వంటివి వస్తుంటాయి. వీటి కారణంగా చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు వంటి వాటిని తొలగించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో లభించే కెమెకిల్ ఆధారిత క్రీములు, లోషన్లు వాడుతూ డబ్బు ఖర్చుపెడుతుంటారు. అంతేకాదు, దాంతో సైడ్‌ఎఫెక్ట్స్ కూడా ఎదురవుతుంటాయి. అయితే, కొన్ని హోం రెమిడీస్ మీకు అద్భుత ఫలితాలిస్తాయి. అందులో ఒకటి పుదీనాతో తయారు చేసుకునే ఫేస్‌ప్యాక్. దీంతో అనేక రకాల ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకుని వినియోగించవచ్చు.
పుదీనా, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ ; కొన్ని తాజా పుదీనా ఆకులను తీసుకుని వాటికి కొద్దిగా రోజ్ వాటర్ కలిపి బ్లెంటర్ లో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖంపై అప్లై చేయాలి. అరగంట పాటు అలాగే ఉంచి తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. . పుదీనాలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలని కలిగించే బ్యాక్టీరిపై దాడి చేసి సమస్యని దూరం చేస్తాయి.వారానికి 3పర్యాయాలు ఇలా చేయటం వల్ల ముఖం అందంగా మారుతుంది.
దోసకాయ ముక్కలు 5..పుదీనా ఆకులు 15 నుంచి 20..ముందుగా రెండింటిని మిక్సీలో వేసి పేస్టులా చేయాలి. ముఖం క్లీన్ చేసి ఆరిన తర్వాత అప్లై చేయండి. ప్యాక్‌ని అలానే 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి.తర్వాత చల్లని నీటితో మసాజ్ చేస్తూ క్లీన్ చేయండి. దీనిని వారానికి రెండు సార్లు చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. దీని వల్ల ఎండ, వాన, చలి నుంచి చర్మానికి రక్షణ దొరుకుతుంది.
పుదీనా, పెరుగు ఫేస్ ప్యాక్ ; గుప్పెడు పొదీనా ఆకులను తీసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ పెరుగును చేర్చి బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్ట్ గా చేసుకోవాలి. ఇలా తయారైన పేస్ట్ కు కొద్దిగా నీరు చేర్చి అనంతరం ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. అరగంటపాటు ఆరనిచ్చాక చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారానికి 3సార్లు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఓట్స్ చర్మానికి చాలా మంచివి. ఓట్స్‌ని వాడడం వల్ల స్క్రబ్‌లా పనిచేస్తాయి. ఓ గిన్నెలో ఓట్స్‌ని పౌడర్ చేసి తీసుకోండి. అందులోనే పుదీనారసం, దోసకాయ పేస్ట్, తేనె వేసి బాగా కలపాలి. దీనిని ఫేస్‌ప్యాక్‌లా వేసి అప్లై చేయండి. దీని వల్ల నల్ల మచ్చలు తగ్గి చర్మం మెరుస్తుంది.
పుదీనా, నిమ్మరసం ఫేస్ ప్యాక్ ; తాజా పుదీనా ఆకులను తీసుకోవాలి. వాటికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం చేర్చి బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ ను ముఖంతోపాటు, మెడబాగాల్లో అప్లై చేయాలి. అరగంట సమయం తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయటం వల్ల ముఖం కాంతి వంతంగా మారటంతోపాటు, మెడపై ఉండే నలుపు తొలగిపోతుంది.
ముల్తానీ మట్టితో.. ముందుగా 20 నుంచి 15 పొదీపా ఆకుల్ని మెత్తగా మిక్సీ పట్టి రసం పిండండి. అందులోనే ముల్తానీ మట్టి వేసి ముఖానికి ప్యాక్‌లా వేయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగండి. జిడ్డు ముఖం ఉన్నవారికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. దీని వల్ల బ్లాక్ హెడ్స్, మొటిమలు తగ్గుతాయి.
పుదీనా,తేనె ఫేస్ ఫ్యాక్ ; గుప్పెడు తాజా పుదీనా ఆకులను తీసుకోవాలి. దానికి కొద్దిగా నీరు, ఒక టేబుల్ స్పూన్ తేనెను చేర్చి మెత్తగా పేస్ట్ లా బ్లెండర్ లో వేసి తయారు చేసుకోవాలి. పెస్ట్ ను ముఖంపై మాస్క్ లా వేసుకోవాలి. అరగంట పాటు అలాగే ఉంచి తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ముఖం పై ఉన్న మొటిమలు తొలగిపోతాయి