అలీఘర్​ ముస్లిం వర్సిటీకి మైనారిటీ హోదా

అలీఘర్​ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా ఉండదని ఎస్ అజీజ్ బాషా వర్సెస్ యూనియన్​ ఆఫ్​ ఇండియా 1967 కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ యూనివర్సిటీకి మైనారిటీ హోదా చట్టం ద్వారా కల్పించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.చంద్రచూడ్​ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4:3 మెజారిటీతో తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో మైనారిటీ హోదా ఉంటుందని అనుకూలంగా సీజేఐ చంద్రచూడ్​, జస్టిస్​ సంజీవ్​ ఖన్నా, జస్టిస్​ జేబీ పార్థీవాలా, జస్టిస్​ మనోజ్​మిశ్రాలు తీర్పు ఇవ్వగా, జస్టిస్​ సూర్యకాంత్​, దీపాంకర్ దత్తా, జస్టిస్​ ఎస్​సీ శర్మలు విభేదించారు. అలీఘర్​ ముస్లిం యూనివర్సిటీ సవరణ చట్టం 1981 మైనారిటీ హోదాను కల్పించిందని పేర్కొన్నది. ఇది అసంపూర్తిగా ఉన్నదని, దానిని పునరుద్ధరించలేదని పేర్కొన్నది. 

ఏఎంయూ చట్టం 1920 ప్రకారం అలీఘర్​ ముస్లిం విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఆ తర్వాత 1951లో ఈ చట్టంలో సవరణ చేసి ముస్లిం విద్యార్థులకు మతపరమైన తప్పనిసరి సూచనలు తొలగించారు.  విద్యా సంస్థ నియంత్రణ, పరిపాలన విషయంలో పార్లమెంట్​లో చట్టం చేసినా  ఆ విద్యాసంస్థలకు ఉన్న మైనార్టీ హోదాను రద్దు చేయరని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 

పార్లమెంట్​ చట్టంతో అలీఘర్​  ముస్లిం వర్సిటీ మైనార్టీ హోదా రద్దు అయినట్లు 1968లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసి తాజా తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించింది. అడ్మినిస్ట్రేషన్​లో మైనార్టీ సభ్యులు లేనంత మాత్రాన ఆ వర్సిటీ మైనార్టీ హోదా పోదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ యూనివర్సిటీని విద్యా సంస్థగా 1875లో మహమ్మద్​ ఆంగ్లో ఓరియంటల్​ కాలేజ్​ పేరుతో సర్​ సయ్యద్​ అహ్మద్​ ఖాన్​ స్థాపించారు. ఆ తర్వాత 1920లో యూనిర్సిటీగా మార్చారు.