పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం : ఎమ్మెల్యే బాలూనాయక్ 

దేవరకొండ, వెలుగు : నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ జలసౌధలో నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఎస్ఎల్​బీసీ

డిండి లిఫ్ట్ ఇరిగేషన్, పెండ్లిపాకల, గాజుబేడం -చిత్రియాల లిఫ్ట్, నేరేడుగొమ్ము, రామనోని బండ లిఫ్ట్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మందుల సామేల్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ,సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అనిల్, సీఈ అజయ్ కుమార్ పాల్గొన్నారు.