హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ పర్యటన 

హుజూర్ నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇరిగేషన్ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నట్లు గురువారం మంత్రి కార్యాలయ సిబ్బంది ప్రకటనలో తెలిపారు. ఉదయం హుజూర్ నగర్ లో ప్రభుత్వ డిగ్రీ,జూనియర్ కళాశాలను విజిట్​ చేస్తారని చెప్పారు.  అనంతరం రూ. 30 కోట్లతో నిర్మించనున్న గరిడేపల్లి టు అలింగాపురం రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, రూ2కోట్ల నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను నేరేడుచర్ల లో ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.