మంత్రి ఉత్తమ్​కు పరామర్శ

యాదాద్రి, వెలుగు : మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిని మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఉత్తమ్​తండ్రి పురుషోత్తంరెడ్డి దశదిన కర్మ గురువారం హైదరాబాద్​లో జరిగింది. ఈ సందర్భంగా పురుషోత్తంరెడ్డి ఫొటోకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్​బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి పూలమాలలు వేసి సంతాపం ప్రకటించారు.