108 వాహనాలను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నియోజకవర్గాలకు కొత్తగా  108 వాహనాలు  మంజూరు అయ్యాయి. గురువారం కోదాడ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజా ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

కోదాడ కు 2, హుజూర్ నగర్ 2 అంబులెన్స్ లు మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వర రావు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, కే ఎల్ యెన్ ప్రసాద్ పాల్గొన్నారు.
 
నేడు హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ పర్యటన 

హుజూర్ నగర్,వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ సిబ్బంది గురువారం తెలిపారు.  శుక్రవారం మధ్యాహ్నం  మల్లారెడ్డిగూడెం నుంచి వయా రేవూరు రాంపురం వరకు  డబల్ రోడ్డు పనులకు,  చౌటపల్లి నుంచి మేళ్లచెరువు వరకు డబుల్ రోడ్డు కు , హుజూర్ నగర్ మండలం లింగగిరి నుంచి గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు వరకు డబుల్ రోడ్డు కు   శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు.