కాళేశ్వరం ప్రాజెక్ట్కు చేసిన నష్టాన్ని కప్పిపుచ్చి.. ఇప్పుడు ఉచిత సలహాలు ఇస్తున్రు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

బీఆర్ఎస్ హయాంలో చేసిన నష్టాన్ని కప్పిపుచ్చి.. ఇప్పుడు ఉచిత సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రూ. 94 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కి దారుణంగా నష్టం వాటిల్లిందన్నారు. రాజ్యాంగ సంస్థ ఎన్డీఎస్ఏ ద్వారా నష్టాన్ని అంచనా వేస్తున్నామని.. విచారణ కొనసాగుతోందని తెలిపారు. ప్రత్యేక కమిటీకి కావలసిన ప్రతి సమాచారాన్ని అందించమని.. అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. విచారణ విషయాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. గృహ జ్యోతి, 500 సిలిండర్ పథకాలు నిరంతర ప్రక్రియ, పథకం వర్తించని వారికి మళ్ళీ అవకాశం ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీస్ భరోసా కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సమూయేల్, మాజీమంత్రి దామోదర్ రెడ్డి, కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పాల్గొన్నారు.

ALSO READ :- ఓహో.. చైనా చాలా ఫాస్ట్ ఫుడ్ డెలివరీ చేస్తున్న రోబో