డిసెంబర్9 లోపు పూర్తిగా రైతు రుణమాఫీ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నల్లగొండ:డిసెంబర్ 9లోపు పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రామన్నపేటలో కొత్త మార్కెట్ భవనాన్ని ప్రారం భించారు మంత్రి తుమ్మల. బీఆర్ ఎస్ ప్రభుత్వం హాయాం కేంద్రంనుంచి వచ్చే సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడం వల్లే సహకార సంఘాలు నష్టపోయా యన్నారు. 

రైతు పండించిన ప్రతి గింజా  కొనుగోలు చేస్తామన్నారు. రైతులు తేమ లేకుండా ధాన్యం, పత్తిని తీసుకురావాలని కోరారు. సహకార సంఘాల అధ్యక్షులు, రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యాన్ని అమ్ముకునేందుకు మిల్లర్లు సహకరించాలని కోరారు. వడ్ల కొనుగోలు విషయంలో మిల్లర్స్ మాట్టాడి వారికి మిల్లింగ్ ఛార్జీలు పెంచా మన్నారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామన్న ఆయన.  రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఎక్కువ 

రుణమాఫీ చేశామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు మంత్రి తుమ్మల. పెండింగ్ లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరారావు. 

ALSO READ : నవంబర్ 10న సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

మరోవైపు చేనేత కార్మికులకు పెండింగ్ లో ఉన్న నిధులను త్వరలోనే మంజూరు చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చేనేత ద్వారా ఉత్పత్తి అయిన చీర లను తెలంగాణ ప్రతి మహిళకు పంచుతామన్నారు. చేనేత వృత్తిపై ఆధారపడి బ్రతికే కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు మం త్రి తుమ్మల నాగేశ్వరరావు.