త్వరలో అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు హెల్త్ క్యాంప్

త్వరలో  ఖాళీగా ఉన్న అంగన్ వాడీ  పోస్టులను  పూర్తి చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.   పెండింగ్ లో  ఉన్న అంగన్ వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారిస్తామని చెప్పారు.   మంథనిలో ICDS ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషన్ మహా - 2024 ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీధర్ బాబు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..  త్వరలో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Also Read :- కేటీఆర్ కు పీసీసీ చీఫ్ మహేష్ సవాల్

గ్రామీణ ప్రాంతాలలో మహిళలకూ సేవలందిస్తున్న అంగన్ వాడీ టీచర్లకు అభినందనలు  తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు.  రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పక్కా భవనాలు నిర్మాణం కావాలని అడుగుతున్నారని.. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు సమాచారం తీసుకుని వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామన్నారు.  పౌష్టిక ఆహారంలో నాణ్యత తగ్గకుండా ఇబ్బంది పెట్టకుండా అందరితో కలసి సమన్వయంతో  ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు శ్రీధర్ బాబు.  రోజూ వారీగా అవగాహణ చైతన్య సదస్సులు నిర్వహిస్తామన్నారు.  ప్రోటీన్స్, మినరల్స్ అధికంగా ఉన్న బాలామృతం పౌష్టిక ఆహారం ఇస్తామని చెప్పారు శ్రీధర్ బాబు.