కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

పెద్దపల్లి: మాజీ మంత్రి కేటీఆర్  సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలకు  ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కౌంటరిచ్చారు.ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుంది. బీఆర్ ఎస్ పార్టీ కి చరెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తాను బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని చెప్పారు.ఇతరుల విషయాన్ని మీరు తలదూర్చినట్లు మేం తలదూర్చం.. మీ పార్టీ అంతర్గత సమస్యల్ని మీరు పరిష్కరించుకోవాలని.. మా పార్టీపై నెపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్పారు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 

ALSO READ | తెలంగాణ అమరవీరులకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నివాళులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడి ప్రజలంతా తెలంగాణ ప్రజలే.. వారందరినీ గౌరవిస్తాం.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నను మరింత పెంచడానికి అందరం పాలు పంచుకోవాలని కోరారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేఝ్ ని కొన్ని ప్రతి పక్షాలు డెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరు ఏం చేసినా హైదరాబాద్ బ్రాండ ఇమేజ్ ని కాపాడుతామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.