కాకా వెంకటస్వామి వలె పేరు తెచ్చుకోవాలె : మంత్రి సీతక్క

  • ఎంపీ వంశీకృష్ణను అభినందించిన సీతక్క
  • మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యే ఆత్మీయ సత్కారం 

సుల్తానాబాద్, వెలుగు: ఎంపీగా ప్రజలకు సేవలందించి కాకా వలె పేరు తెచ్చుకోవాలని మంత్రి సీతక్క.. వంశీకృష్ణకు సూచించారు. ఆదివారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసానికి వచ్చిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్​బాబు, మంత్రి సీతక్క, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ లకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు. అనంతరం వారికి ఆత్మీయ సత్కారం చేశారు. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. 

అలాగే, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్యే విజయ రమణారావులను, ఎంపీ గడ్డం వంశీకృష్ణ శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా గడ్డం వంశీకృష్ణను శ్రీధర్ బాబు, సీతక్క అభినందించారు.  వంశీకృష్ణ తో సీతక్క మాట్లాడుతూ, మీ తాత.. కాకా వెంకటస్వామి వలె పేదల కోసం పాటుపడుతూ పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. పలు మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలను సత్కరించారు.