ములుగు పంపు హౌస్ నుండి గోదావరి జలాలు విడుదల చేసిన మంత్రి సీతక్క

ములుగు పంపు హౌస్ నుండి గోదావరి జలాలను విడుదల చేశారు మంత్రి సీతక్క. ములుగు పంపు హౌస్ నుండి  జంగాల పల్లి బంజరు చెరువుకు నీటిని విడుదల చేశారు. గోదావరి జలాల ద్వారా ములుగు జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని ఈ సందర్భంగా సీతక్క తెలిపారు.

 గత పాలకుల నిర్లక్ష్యం వలన ములుగు వెనకబాటుకు గురైందన్నారు. గత ప్రభుత్వం ములుగు నియోజక వర్గానికి చుక్క నీరు ఇవ్వకుండా సిద్దిపేట, సిరిసిల్లకు  నీళ్లను తరలించుకుపోయారని విమర్శించారు. - రైతును రాజు చెయ్యడమే తమ మా ప్రభుత్వ లక్ష్యమని సీతక్క అన్నారు. 

ALSO READ | ఆపరేషన్ ఫార్ములా -ఈ .. కేటీఆర్ మెడకు బిగుస్తున్నఉచ్చు