పెండింగ్ పనులు పూర్తయితే 523 గ్రామాలకు తాగునీరు : మంత్రి సీతక్క

మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తయితే  యాదాద్రి భువనగిరి  జిల్లాలో 523 గ్రామాలు,  3 నియోజకవర్గాలకు తాగునీరు అందుతుందన్నారు మంత్రి సీతక్క.  కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఎక్కువ చెప్పుకునేది తక్కువన్నారు. చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే  మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించాం.  రైతు రుణాలను మాఫీ చేశాం.  రూ.500 వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.  ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వొద్దని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెక్రటేరియట్ లోకి ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అనుమతి లేదన్నారు సీతక్క.  అబద్ధాలతో మళ్లీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు.   ధరణిని అడ్డంపెట్టుకుని పేదల భూములను బీఆర్ఎస్ నాయకులు  దోచుకుతిన్నారని ఆరోపించారు.

ALSO READ : BRS పెట్టిన బొక్కల పూడ్చడానికే సగం పైసలు పోతున్నయ్: మంత్రి కోమటిరెడ్డి

అధికారం ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు సీతక్క.  ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు.  గ్రామపంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఇంకా  నాలుగు లక్షల ఇండ్లకు నీరు అందడం లేదని.. అందరికీ మంచినీరు అందించేలా కృషి చేస్తామన్నారు సీతక్క.