ఏజెన్సీలో రోడ్ల నిర్మాణాలను అడ్డుకోవద్దు: మంత్రి సీతక్క

  • మారుమూల గ్రామాల అభివృద్ధితోనే అసలైన అభివృద్ధి: మంత్రి సీతక్క

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/ములుగు/తాడ్వాయి, వెలుగు: ఏజెన్సీలో రోడ్ల నిర్మాణాలను  ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకోవద్దని పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి సీతక్క సూచించారు.  మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే అసలైన అభివృద్ధి జరిగినట్లని పేర్కొన్నారు.  

యాస్పిరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోనే తొలిసారి ములుగు జిల్లాలో మెగా జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేళా నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చినట్లు మంత్రి తెలిపారు.  

మంగళవారం జిల్లాలో ఆమె పర్యటించారు. తాడ్వాయి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం పోచాపూర్ లో ప్రజాదర్బార్,  గోవింద రావుపేట మండలం చల్వయిలో  మెగా జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేళాలో పాల్గొన్నారు.  పోచాపుర్  మినీ గురుకులంలో  విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు.  

మినీ మేడారం వర్క్స్‌‌‌‌‌‌‌త్వరగా కంప్లీట్‌‌చేయండి 

 వచ్చే నెల 12 నుంచి15 వరకు మినీ మేడారం జాతర సందర్భంగా ఇప్పటికే  భక్తులు రాక పెరిగిందని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.  జాతరకు వచ్చే అన్ని లింక్ రోడ్లను ఈనెలలోపు పూర్తి చేయాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు.  పోలీసు బందోబస్తు  కొనసాగించాలన్నారు.

ములుగులో తొలి మెగా జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేళా

రాష్ట్రంలోనే తొలిసారిగా ములుగు జిల్లాలో మెగా జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేళా నిర్వహించినట్టు  మంత్రి తెలిపారు.  యువత ప్రైవేట్ జాబ్ లు చేయడం అవమానంగా భావించవద్దన్నారు.  

కొంతమంది జాబ్ ల కోసం  ప్రయత్నిస్తూనే వ్యవసాయం, వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు  ప్రభుత్వం  రుణాలు  మంజూ రు చేస్తుందన్నారు.  గత జాబ్ మేళాలో  800 మందికి జాబ్ లు వచ్చాయని, ప్రస్తుతం 12,200 మందికి ఉద్యోగాలు   కల్పించనున్నట్టు కలెక్టర్  టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దివాకర  చెప్పారు.