‘సర్కారు బడిలో చదవాలిరా..’

  •     పాటను విడుదల చేసిన మంత్రి ప్రభాకర్​

సైదాపూర్​, వెలుగు : ‘సర్కార్​ బడిలోనే చదవాలిరా’ అంటూ విద్యార్థులకు అవగాహన కల్పించే పాటను బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకత, సౌకర్యాలను తెలియజేస్తూ రచయిత, గాయకుడు అనపురం రమేశ్ గౌడ్ పాట రాశాడు.

కాగా ఈ పాటను మంత్రి ‘మనపల్లెమస్తీ’ అనే యూట్యూబ్ చానల్ ద్వారా హుస్నాబాద్ లోని తన ఆఫీసులో విడుదల చేశారు. ఈ పాటను రమేశ్‌‌‌‌‌‌‌‌, నిఖిల పాడగా, మ్యూజిక్ విల్సన్ మ్యూజిక్ అందజేశారు.