లోయర్ మానేరు డ్యాంను సందర్శించిన మంత్రి పొన్నం

 కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంను సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్బంగ మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై  ప్రభుత్వం మానిటరింగ్  చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తున్నామన్నారు. తుమ్మిడి హట్టి నుంచి గ్రావిటీ ద్వారా ప్రాణహిత నీటిని ఎల్లంపల్లికి తెచ్చుకునే వీలున్నప్పటికీ  కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు పొన్నం. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో నీరు నిలిపే పరిస్థితి లేకపోవడంతోనే ఎల్లంపల్లి నుంచి నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. వర్షాలపై సమీక్ష నిర్వహిస్తూ సహాయక చర్యలు చెపడుతామన్నారు.

ALSO READ | జగిత్యాల జిల్లాలో భారీ వర్షం.. పొంగిపొర్లుతోన్న వాగులు, వంకలు

మిడ్ మానేరు జలాశయంలోకి భారీగా వరద వచ్చి చేరుతోందన్నారు పొన్నం. కొండపోచమ్మ, రంగనాయక సాగర్ సహా మిగిలిన అన్ని ప్రాజెక్టులకు కూడా నీళ్లు సమృద్ధిగా అందుతాయని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు  ఎత్తిపోయడం లేదని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ దగ్గర టెక్నికల్ సమస్య వల్ల ఇంజనీర్ల సూచన మేరకే గేట్లను ఓపెన్  చేశామన్నారు.  తమ్మిడిహట్టి  నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించే వీలు ఉన్నా కూడా, గతంలో రివర్స్ పంపింగ్ చేశారని చెప్పారు. వర్షాల కారణంగా ఎవరైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.  లోతట్టు ప్రాంతాలలో వర్షాల కారణంగా ఇబ్బందులు పడితే వారికి పునరావాస కేంద్రాలు కల్పిస్తామన్నారు.