ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం

భీమదేవరపల్లి, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో గ్రామం నుంచి అక్కన్నపేట మండలం అంతకపేట వరకు సీఆర్ఐఎఫ్​ద్వారా మంజూరైన రూ.25 కోట్లతో డబుల్​ రోడ్డు విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 

రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్​మండలాధ్యక్షుడు చిట్టంపెల్లి ఐలయ్య, యూత్​ అధ్యక్షుడు జక్కుల అనిల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.