జమ్మికుంట నుంచి రాజధానికి బస్సు సౌకర్యం : పొన్నం ప్రభాకర్​

జమ్మికుంట, వెలుగు: వ్యాపార కేంద్రమైన జమ్మికుంట నుంచి రాజధాని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వెళ్లేందుకు ఉదయం బస్‌‌‌‌‌‌‌‌ సౌకర్యం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ హామీ ఇచ్చారు. హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ మండలం వెంకట్రావుపల్లిలో గ్రామానికి చెందిన పీసీసీ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పత్తి కృష్ణారెడ్డి సోదరుడు, రిపోర్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విష్ణువర్ధన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇటీవల గుండెపోటుతో చనిపోగా మంగళవారం బాధిత కుటుంబాన్ని పరార్శించారు.

అదే విధంగా మరో విలేకరి సంపత్‌‌‌‌‌‌‌‌ తండ్రి చనిపోగా ఆయనను పరామర్శించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి బస్టాండ్‌‌‌‌‌‌‌‌ వద్ద ఉన్న హోటల్‌‌‌‌‌‌‌‌లో చాయ్‌‌‌‌‌‌‌‌ తాగారు. మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు ఉదయం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు బస్సు లేక ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకురాగా, ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌ బస్సు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట పీసీసీ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి, లీడర్లు దేశిని కోటి, తుమ్మేటి సమ్మిరెడ్డి, రవి, సదయ్య, రమేశ్‌‌‌‌‌‌‌‌, తదితరులు పాల్గొన్నారు.