కరీంనగర్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  పొన్నం ఫోకస్ 

  • బల్దియా ఎన్నికలపై ఇప్పటి నుంచే గురిపెట్టిన మంత్రి 
  • బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్రూపు తగాదాలను అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహం
  • కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అవినీతి, అక్రమాలను బహిర్గతం చేయాలని లీడర్లకు దిశానిర్దేశం
  • కష్టపడి పనిచేసేవాళ్లకే టికెట్లు ఇస్తామని హామీ 

కరీంనగర్, వెలుగు: మరికొద్ది నెలల్లో నిర్వహించనున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లోనూ పార్టీ పుంజుకుంటోంది.. అయినప్పటికీ కరీంనగర్ నియోజకవర్గంలో సరైన లీడర్ లేక ఇక్కడి రాజకీయం బీఆర్ఎస్  వర్సెస్ బీజేపీగా మాత్రమే నడుస్తోంది.

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జిగా పురుమల్ల శ్రీనివాస్ వ్యవహరిస్తున్నప్పటికీ.. ఆయన కేవలం బొమ్మకల్ జీపీకే పరిమితం కావడం ఆ పార్టీ క్యాడర్ కు ఇబ్బందికరంగా మారింది. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే పార్టీని బలోపేతం చేయడంపై మంత్రి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల రెండుసార్లు వరుసగా కరీంనగర్ లోని పార్టీ ముఖ్యులతో సమావేశమై దిశానిర్దేశం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

మూడు పార్టీలకు సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బల్దియా ఎన్నికలు 

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలు సవాల్ గా మారబోతున్నాయి.  ముఖ్యంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కేంద్రమంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారబోతున్నాయి.  అందుకే  పొన్నం ప్రభాకర్ ఇప్పటి నుంచే క్యాడర్ ను అలర్ట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. 2020 జనవరిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లలో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు. దీంతో కార్పొరేషన్ లో ఆ పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మొన్నటి లోక్ సభ ఎన్నికల టైంలోనే 12 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు మంత్రి పొన్నం సమక్షంలో  కాంగ్రెస్ లో చేరారు.  అప్పట్లోనే మరికొందరిని చేర్చుకుని ఎంఐఎం సహకారంతో మేయర్ పీఠం చేజిక్కించుకోవానే ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం జరిగింది.

కానీ ఆ తర్వాత ఆశించినంతగా చేరికలు లేకపోవడంతో ఈ అంశం పక్కకు పోయింది. అయితే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు గతంలోలాగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య జరిగితే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో మంత్రి పొన్నం కార్పొరేషన్ పై సీరియస్ గా దృష్టిసారించారు. ఆయా డివిజన్లలో చురుగ్గా ఉన్న వారి జాబితా కూడా సిద్ధం చేసే పనిలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. 

అవినీతిపై ఎందుకు ప్రశ్నించట్లే.. 

ముఖ్యంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతిపై స్వయంగా బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే.. మీరేం చేస్తున్నారని కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లకు క్లాస్ పీకినట్లు తెలిసింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బల్దియా ఆఫీసర్ల అవినీతిపై జరుగుతున్న ప్రచారంపై ఎందుకు ఫోకస్ చేయడం లేదని వారిపై ఆగ్రహం  వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో బీజేపీ  కార్పొరేటర్లు మౌనంగా ఉంటున్నారని, ఇదే అదునుగా కాంగ్రెస్ కార్పొరేటర్లు గొంతెత్తితే ప్రజల్లో దృష్టిని పార్టీ వైపు తిప్పుకోవచ్చని వారికి సూచించినట్లు తెలిసింది.

బీఆర్ఎస్ గ్రూపు తగాదాలపై దృష్టి.. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్  సింబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచిన కార్పొరేటర్లలో 11 మంది కాంగ్రెస్ లో చేరగా.. ఇద్దరు బీజేపీలో చేరారు. మిగతా వాళ్లు ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య కూడా సఖ్యత లేదనే ప్రచారం ఉంది. మేయర్ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావును టార్గెట్ చేస్తూ కొద్దిరోజులుగా డిప్యూటీ మేయర్ స్వరూపారాణి భర్త, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

గతంలోనూ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు ఇటీవల మేయర్ అమెరికా పర్యటన సందర్భంగా బయటపడ్డాయి. అప్పటినుంచి చల్లా హరిశంకర్.. సొంత పార్టీ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే  బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిని మంత్రి పొన్నం ప్రభాకర్ సునిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం.