తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 25 వేల పాఠశాలలో 1100 కోట్లతో మౌలిక వసతులు కల్పించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 19 వేల మంది మోడల్ స్కూల్ టీచర్లకు ప్రమోషన్లు ,35 వేల మందికి బదిలీలు చేపట్టామని చెప్పారు. అన్ని గురుకులాలు అద్దె చెల్లించామని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చెల్లిస్తున్నామన్నారు. ఉన్నత శిఖరాలకు అదిరోహించాలంటే విద్యార్థులు కష్టపడాలని సూచించారు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బంది ఉంటే అధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచించారు పొన్నం.
హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. చిగురు మామిడి మండలం చిన్న ముల్కనురు మోడల్ స్కూల్ &జూనియర్ కాలేజీలో విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ షూ పంపిణీ చేశారు. కలెక్టర్ చొరవతో సీఎస్ ఆర్ ఫండ్స్తో షూస్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో 1098 మంది విద్యార్థులకు షూస్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లాలో 23 వేల మంది విద్యార్థులకు షూస్ పంపిణీ చేస్తామన్నారు పొన్నం.