కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులను త్వరగా పూర్తి చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

  • ఎన్జీటీ కేసు, ఇతర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై ఆరా

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ స్మార్ట్ సిటీ పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన చాంబర్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి శుక్రవారం రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు.  కరీంనగర్ స్మార్ట్ సిటీ లో మొత్తం 47 పనులు ప్రారంభించగా 25 పూర్తయ్యాయని, మరో 20 ప్రస్తుతం నడుస్తున్నాయని, మరో రెండు పనులు ప్రారంభం కాలేదని కరీంనగర్ మున్సిపల్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 

అంబేద్కర్ స్టేడియంలో చేపట్టిన  పెండింగ్ పనులు నెలలోపు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్ లో 27 స్కూళ్లు అభివృద్ధి చేయాల్సి ఉండగా ఎన్ని పూర్తయ్యాయి.. ?  మౌలిక వసతులు ఏం కల్పించారని ఆరా తీశారు.  సర్కస్ గ్రౌండ్ నిర్వహణ, వస్తున్న ఆదాయం, అది నగర ప్రజలకు ఎంత వరకు ఉపయోగపడుతుందని అధికారులను ప్రశ్నించారు. ఓల్డ్ పవర్ హౌజ్ జంక్షన్ ,హెచ్ కేఆర్ జంక్షన్, సదాశివపల్లి, తెలంగాణ చౌక్ తదితర పనుల పురోగతిని ప్రొజెక్టర్ ద్వారా పరిశీలించారు.  కొన్ని జంక్షన్లకు ఇష్టారీతిన అంచనా విలువ పెంచారని, వాటి వివరాలు సేకరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. 

డంపింగ్ యార్డు నిర్వహణపై ఆగ్రహం

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని డంపింగ్ యార్డు విషయంలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కమిటీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన విధానాలు పాటించకపోవడం వల్లే డంపింగ్ యార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంటలంటుకొని కరీంనగర్ సిటీలో పొగ సమస్య ఏర్పడుతోందన్నారు. ప్రస్తుతం నడుస్తున్న పనుల్లో క్వాలిటీ మెయింటేన్ చేయాలని అధికారులను ఆదేశించారు. మానేరు రివర్ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై డిసెంబర్ 2న ఎన్జీటీలో  విచారణ ఉండడంతో దానిపై ఏం చేస్తే బాగుంటదని అధికారులతో చర్చించారు. రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మున్సిపల్ డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక, కరీంనగర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాయ్ , ఇరిగేషన్, టూరిజం, అధికారులు  పాల్గొన్నారు.