కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే.. మంత్రి పొంగులేటి ఫైర్

వేములవాడ: మాజీ సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతారని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేములవాడ, భద్రాచలం డెవలప్ కోసం హామీలు ఇచ్చి నేరవేర్చలేదు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయిన.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. బుధవారం (నవంబర్ 20) వేములవాడలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా వియోత్సవ సభలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. --రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలో 3500 చొప్పున 20 లక్షల ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు.-- 

ALSO READ | నీ స్కాములన్ని బయటపెడుతా.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు: కౌశిక్ రెడ్డిపై వెంకట్ ఫైర్

ఏ పార్టీ, ఏ కులము, ఏ పార్టీకి ఓటు వేస్తావని అడగకుండానే అర్హులైన పేదలకు ఇండ్లు ఇస్తామన్నారు. -- ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అని అభివర్ణించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం-- ధరణి పేరుతో రూ.2 కోట్ల 59 లక్షల ఎకరాలను విదేశీ సంస్థకి తాకట్టు పెట్టిందని.. దానిని మళ్ళీ స్వదేశీ కంపెనీకి అప్పగించామని పేర్కొన్నారు. -- గత ప్రభుత్వం ధరణి పేరుతో వేలాది ఎకరాలు పింక్ కలర్ చొక్కాలు ధరించిన వారికి ఇచ్చారని.. వాటిని మేం మళ్ళీ పేదలకు తిరిగి ఇస్తామని స్పష్టం చేశారు.