హైదరాబాద్: కేసీఆర్ కాలు గోటికి కూడా సీఎంరేవంత్ రెడ్డి సరిపోడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైరయ్యారు. రేవంత్ రెడ్డి చిటికెన వేలుకు కూడా నీవు సరిపోవంటూ కేటీఆర్ పై ధ్వజమెత్తారు. కాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ కు పంపించాడని ఎద్దేవా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలోని మహాదేవపూర్ లో వేణుగోపాలస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ భాష మార్చుకోవాలని, సీఎంను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ గా జడ్పీటీసీ నుంచి సీఎం అయిన వ్యక్తి అని.. నువ్వు కేసీఆర్ పేరుతో దొంగ మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావని ఘాటుగా విమర్శించారు. కేటీఆర్ అహంకారంతోనే నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది అంటే చేసే చూపిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
సీఎంను గౌరవించడం నేర్చుకో.. కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
- నల్గొండ
- January 29, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.