- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మిర్యాలగూడ, వెలుగు : జాన్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబానికి అండగా ఉంటామని ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని కొత్తగూడెం గ్రామ మాజీ ఉపసర్పంచ్ గడ్డం జాన్ రెడ్డి(40) ఈనెల 29న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి సోమవారం కొత్తగూడెంకు వెళ్లి జాన్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్ సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, మాజీ జడ్పీటీసీ పుల్లెంల సైదులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, ఉన్నారు.
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
నల్గొండ అర్బన్, వెలుగు : సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సోమవారం నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కలెక్టరేట్‌వద్ద దీక్ష చేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఉద్యోగుల డిమాండ్లను పరిశీలించి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.