డంపింగ్ యార్డుకు మోక్షం..నల్గొండ అభివృద్ధికి పక్కా ప్లాన్

  • ఆరు నెలల్లో ఖాళీ చేసేందుకు రాంకీ సంస్థతో డీల్​
  • ఇళ్ల నుంచే చెత్తను సేకరించేందుకు ఐటీసీ కంపెనీతో ఒప్పందం
  • నల్గొండ పట్టణంలో ట్రాఫిక్​ సిగ్నల్స్​, సీసీ కెమెరాలు
  • రూ.5.50 కోట్లతో అండర్ ​గ్రౌండ్ డ్రైనేజీ రిపేర్​

ఉమ్మడి జిల్లాలో గ్రేడ్​వన్​మున్సిపాలిటీగా పేరొందిన నల్గొండ ప్రక్షాళన శరవేగంగా జరుగుతోంది. చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు కార్యచరణ సిద్ధమైంది. నల్గొండను అభివృద్ధి చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కా ప్రణాళిక తయారు చేయించారు. ఇందులో భాగంగా చందనపల్లి డంపింగ్​యార్డును పూర్తిగా క్లీన్ చేసేందుకు డీల్​ కుదుర్చారు.  ఇక ట్రాఫిక్​ సిగ్నల్స్​, సీసీ కెమెరాల ఏర్పాటు, అండర్ ​గ్రౌండ్ డ్రైనేజీ రిపేర్ పనులు వేగంగా సాగుతున్నాయి. ​

నల్గొండ, వెలుగు : నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి చందనపల్లి గ్రామ శివారులో గతంలో 20 ఎకరాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. గత 20 ఏళ్లుగా12 ఎకరాల్లో పాత చెత్త అంతా పేరుకుపోయింది. దారి పొడవునా ఎప్పుడూ మంటలు, పొగలతో ఆ ప్రాంతమంతా కాలుష్య కాసారంగా తయారు కావడంతో ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

పక్కనే ఉన్న ఉదయ సముద్రం రిజర్వాయర్ సమీపంలోనూ వ్యర్థాలను పడేస్తున్నారు. ఫలితంగా పరిసర ప్రాంతాలు కాలుష్య కోరుల్లో చిక్కుకొని స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. దీంతో డంపింగ్​యార్డులోకి కొత్త చెత్త రాకుండా, ఇప్పుడున్న పాత చెత్తను తరలించేందుకు రాంకీ, ఐటీసీ సంస్థలతో డీల్​ కుదుర్చుకున్నారు.

ప్లే గ్రౌండ్​గా మారునున్న డంపింగ్ యార్డు

వచ్చే ఆరు నెలల్లో చందనపల్లి డంపింగ్​యార్డు​ మొత్తం ఖాళీ కానుంది. ప్రతి రోజు పట్టణం నుంచి 1.5 లక్షల టన్నుల చెత్త డంపింగ్​ యార్డుకు చేరుతోంది. ఇందులో కొంత భాగం తడి, పొడి చెత్తతో వర్మి కంపోస్ట్​ తయారు చేస్తున్నారు. మిగిలిన చెత్తంతా దాదాపు12 ఎకరాల్లో పేరుకుపోవడంతో దీనిని రాంకీ సంస్థ ఖాళీ చేయనుంది. కొత్త చెత్త రాకుండా ఉండేందుకు ఐటీసీ కంపెనీకి చెత్త సేకరణ బాధ్యత అప్పగించారు. ప్రస్తుతం ఇళ్ల వద్దనే తడి, పొడి చెత్తను మున్సిపల్​ సిబ్బంది వేరు చేస్తున్నారు. ఇకపై దీన్ని పూర్తిస్థాయిలో పక్కాగా అమలు చేయనున్నారు.

మళ్లీ డంపింగ్​యార్డ్​లో చెత్త పడేయకుండా ఐటీసీ కంపెనీ వివిధ అవసరాలకు తరలించనుంది. తద్వారా చందనపల్లి డంపింగ్​యార్డు​ ప్లే గ్రౌండ్​లా మారుతుందని అధికారులు తెలిపారు. ఇందుకోసం సెంట్రల్​ పొల్యూషన్​బోర్డు రూ.40 లక్షల నిధులు మంజూరు చేసింది. 

* మరోవైపు, నకిరేకల్​నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు జాతీయ రహాదారి పట్టణం లోపలి నుంచే పోతుంది. అయితే, పానగల్లు ఫ్లైఓవర్​ వద్ద అండర్​ గ్రౌండ్ డ్రైనేజీ సరిగా లేకపోవడంతో మురుగు రోడ్ల పైకి చేరుతుంది. దీంతో ప్రస్తుతం రూ.5.50 కోట్లతో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజ్​ను రిపేర్​ చేస్తున్నారు. తద్వారా వరద నీరంతా అండర్​ గ్రౌండ్​ నుంచి ట్రీట్మెంట్​ప్లాంట్​కు చేరనుంది. 

9 జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ​సిగ్నల్స్​

నల్గొండ పట్టణంలో ప్రమాదాల నివారణకు 9 జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ​సిగ్నల్స్​​, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్​నుంచి మర్రిగూడ బైపాస్​ రోడ్డు, పానగల్లు నుంచి డీవీకే రోడ్డు మార్గంలోని వైఎస్సార్​జంక్షన్​ వరకు ముఖ్యమైన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నల్గొండ లోపలి నుంచే జాతీయ, రాష్ట్ర రహదారులు పోతున్నాయి. ఇటీవల కాలంలో పట్టణంలోనూ వాహనాల రద్దీ పెరిగింది.

గత ప్రభుత్వం జంక్షన్ల నిర్మా ణంలో చేసిన లోపాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యి. బైక్​లు, ఆటోలు, కార్లకు స్పీడ్​ కంట్రోల్​ లేకుండా పోయింది. దీంతో ట్రాఫిక్​ కంట్రోల్​కు, మితిమీరిన వేగాన్ని అదుపు చే సేందుకు తొలిసారిగా పట్టణంలో ట్రాఫిక్​ సిగ్నల్​, సీసీ కెమెరాలు మున్సిపల్​ ఫండ్స్​తో ఏర్పాటు అవుతున్నాయి.