కేసీఆర్ అసెంబ్లీకి రావాలి: మంత్రి కోమటిరెడ్డి డిమాండ్

నల్లగొండ: మంత్రి పదవి కంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ముఖ్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 2024, అక్టోబర్ 16న నిడమనూరు మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. స్థానిక మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‎లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి కాదు ఒక బాధ్యత అని అన్నారు. ఇక, మాజీ మంత్రి జానారెడ్డిపై ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రశంసలు కురిపించారు. పదవి ఉన్న లేకున్నా జనా రెడ్డినే ఒక పెద్ద పదవని కొనియాడారు. 

ALSO READ | పొరపాట్లను సరిదిద్దుకోండి: మంత్రి సీతక్క

ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా ఇద్దరు కొడుకులను భారీ మెజార్టీతో గెలిపించుకున్నారన్నారు. పదేళ్లు తెలంగాణను పాలించిన గత బీఆర్ఎస్  ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షం అంటే సీఎం తర్వాత ప్రధానమైన స్థానమని.. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్ అండ్ బీ శాఖ ద్వారా నల్గొండ జిల్లాకు రూ.516 కోట్లు కేటాయించామని తెలిపారు.